CM Revanth Review: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ ప్రమాదంపై సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష, బాధితుల కుటుంబాలకు అండగా ఉంటామని హామీ

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో (SLBC Tunnel) జరిగిన ప్రమాదంపై సీఎం రేవంత్‌ రెడ్డి సమీక్ష (CM Revanth Reddy) నిర్వహించారు. సాగునీటిశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, సాగునీటి పారుదల శాఖ సలహాదారు ఆదిత్యనాథ్ దాస్, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి ఎస్‌ఎల్‌బీసీ ప్రమాదం ఘటన, ప్రస్తుత పరిస్థితిపై పూర్తి వివరాలను సీఎం రేవంత్‌రెడ్డికి ఉత్తమ్‌ వివరించారు

CM Revanth Reddy CMO)

Hyderabad, FEB 22: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో (SLBC Tunnel) జరిగిన ప్రమాదంపై సీఎం రేవంత్‌ రెడ్డి సమీక్ష (CM Revanth Reddy) నిర్వహించారు. సాగునీటిశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, సాగునీటి పారుదల శాఖ సలహాదారు ఆదిత్యనాథ్ దాస్, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి ఎస్‌ఎల్‌బీసీ ప్రమాదం ఘటన, ప్రస్తుత పరిస్థితిపై పూర్తి వివరాలను సీఎం రేవంత్‌రెడ్డికి ఉత్తమ్‌ వివరించారు. సొరంగంలో చిక్కుకున్న ఎనిమిది మంది కార్మికులను కాపాడేందుకు సహాయక చర్యల్లో మరింత వేగం పెంచాలని రేవంత్‌రెడ్డి సూచించారు. గాయపడ్డ వారి పరిస్థితిని ఆరా తీశారు.

Srisailam Tunnel Collapse:ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ దగ్గర సహాయక చర్యలు ముమ్మరం, రంగంలోకి సైన్యానికి చెందిన స్పెషల్ బృందం  

సీఎం గాయపడిన వారికి మెరుగైన వైద్య సాయం అందించాలని.. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా కల్పించాలని చెప్పారు. ఎస్డీఆర్ఎఫ్, ఎన్ఆర్డీఎఫ్ బృందాలు ప్రమాద స్థలికి చేరుకోనున్నాయని సీఎంకు వివరించిన మంత్రి ఉత్తమ్ సహాయక చర్యలు చేపట్టే విషయంలో అన్ని విభాగాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement